ఇంట్లో స్థలాన్ని ఎలా పొదుపు చేసుకోవాలి?: ఆనంద్ మహీంద్రా వీడియో
- మెట్ల కింద ఖాళీ స్థలం షెల్ఫులుగా ఏర్పాటు
- అందులో ఎన్నో వస్తువుల సర్దుబాటు
- దీన్ని ఎంతగానో మెచ్చుకున్నా ఆనంద్ మహీంద్రా
తనకు నచ్చి, పది మందికి ఉపయోగపడుతుందని, ఆలోచించేలా చేస్తుందని భావిస్తే చాలు.. అది ఫొటో అయినా, వీడియో అయినా, సందేశం అయినా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో తన కోటి మంది ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటారు. మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ గా ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ ట్విట్టర్ యూజర్లకు అతి చేరువగా అందుబాటులో ఉండడం ఆయనకు ఎంతో ఇష్టం. తాజాగా ఆయన ఓ గ్రామంలోని ఇంటిలో స్థలం ఆదా చేసుకునే దానికి సంబంధించి ఫొటోని షేర్ చేశారు.
హిమాన్షు మారియా అనే వ్యక్తి ఓ ఇంటి ఫొటోని ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘‘నేను ఈ రోజు కార్పెంటర్ సాయంతో గ్రామంలోని ఓ ఇంట్లో వస్తువులను ఇలా సర్దుబాటు చేశాను. ఇలాంటి చోట పెట్టుకోవడానికి గ్రామాలలో రకరకాల ఎన్నో వస్తువులు ఉంటాయి’’ అని హిమాన్షు ఫొటోలతో ఓ పోస్ట్ పెట్టారు. ఇళ్లల్లో మెట్ల కింద ఖాళీ స్థలం ఉంటుందని తెలుసు. పట్టణాల్లో అయితే దాని కింద ఓ టాయిలెట్ ఏర్పాటు చేస్తుంటారు. కానీ హిమాన్షు వస్తువులను పెట్టుకునేందుకు వీలుగా కార్పెంటర్ సాయంతో షెల్ఫ్ లుగా ఏర్పాటు చేశాడు. దానికింద చాలా వస్తువులు పెట్టేశాడు.
ఆనంద్ మహీంద్రా దీన్ని రీట్వీట్ చేస్తూ మూడు నమస్కారం ఎమోజీలను పోస్ట్ చేశారు. దీనికి హిమాన్షు బారియా స్పందిస్తూ.. ‘‘ధన్యవాదాలు సర్. నేను గ్రామాల్లోని వారి స్థలాల వినియోగాన్ని పెంచేలా డిజైన్ చేస్తుంటాను’’ అని రిప్లయ్ ఇచ్చాడు.