పూణేలో యువతిని కాపాడింది మా పార్టీ వ్యక్తే.. కాంగ్రెస్ ప్రకటన

  • ఉన్మాది దాడి నుంచి యువతిని కాపాడిన లేష్‌పాల్ తమ పార్టీ కార్యకర్త అన్న కాంగ్రెస్
  • భారత్ జోడో యాత్రలో కూడా అతడు  పాల్గొన్నాడని వెల్లడి
  • ‘భయం వద్దు’ అన్న రాహుల్ గాంధీ పిలుపు అతడిలో స్ఫూర్తి నింపిందని వ్యాఖ్య
పూణెలో ఇటీవల ఓ ఉన్మాది పైశాచిక దాడి నుంచి యువతిని కాపాడింది తమ పార్టీకి చెందిన వ్యక్తేనని కాంగ్రెస్ తాజాగా ప్రకటించింది. తన ప్రేమను ఒప్పుకోవట్లేదంటూ ఓ యువకుడు 19 ఏళ్ల యువతిపై నడిరోడ్డు మీద కొడవలితో దాడికి యత్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్థానికులు నిందితుడిని అడ్డుకోవడంతో యువతికి ప్రాణాపాయం తప్పింది. 

కాగా, ఘటన జరిగిన సమయంలో తమ పార్టీకి చెందిన లేష్‌పాల్ అక్కడే ఉన్నాడని కాంగ్రెస్ పేర్కొంది. యువతిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తొలుత లేష్‌పాల్ యువకుడిని ప్రతిఘటించి బాధితురాలిని రక్షించాడని పేర్కొంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కూడా లేష్‌పాల్ పాల్గొన్నాడని తెలిపింది. ‘భయం వద్దు’ అన్న రాహుల్ గాంధీ పిలుపుతో లేష్‌పాల్ స్ఫూర్తి పొందాడని చెప్పింది.


More Telugu News