మేం చేయగలిగింది ఏముంది..ఉమ్మడి పౌర స్మృతిపై జమైత్ ఉలేమా హింద్ చీఫ్ వ్యాఖ్య
- ముస్లింల హక్కులు లాగేసుకుంటామని ప్రధాని అన్నారన్న మౌలానా అర్హద్ మదానీ
- ఈ పరిస్థితిల్లో చేయగలిగింది ఏముందని వ్యాఖ్య
- ప్రధాని ప్రకటన అనంతరం ముస్లిం పర్సనల్ లా బోర్డు సమావేశం
- తమ అభిప్రాయాలను లా కమిషన్‌కు నివేదించాలని నిర్ణయం
ఉమ్మడి పౌర స్మృతిపై ముస్లింలు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారని కానీ, తమ వినతి ఆలకిస్తారన్న ఆశలు పెద్దగా లేవని జమైత్-ఉలేమా-ఎ-హింద్ చీఫ్ మౌలానా అర్షద్ మదానీ అన్నారు. ‘‘ఈ విషయంలో ఎవరైనా చేయగలిగింది ఏముంటుంది? ముస్లింల మత హక్కులను తీసేసుకుంటామని ప్రధాని బహిరంగంగానే చెప్పారుగా’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, ప్రధాని ప్రకటన అనంతరం ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశం అనంతరం లా బోర్డు సభ్యులు తమ అభిప్రాయాలను లా కమిషన్ ముందుంచాలని నిర్ణయించారు. అయితే, ఈ విషయంలో ప్రభుత్వం ఏదో చేస్తుందని తాము ఆశించట్లేదని వ్యాఖ్యానించారు.