ఖురాన్ పై ఓ తప్పుడు డాక్యుమెంటరీని తీయండి... ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి: ఆదిపురుష్ కేసులో అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు
- ఆదిపురుష్ చిత్రానికి వ్యతిరేకంగా పిటిషన్లు
- అలహాబాద్ హైకోర్టులో విచారణ
- ఫిలింమేకర్స్ మతాల జోలికి వెళ్లవద్దన్న న్యాయస్థానం
- మతాలను తప్పుగా చూపించవద్దని హితవు
ఆదిపురుష్ చిత్రానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మతపరమైన అంశాలపై ఫిలింమేకర్లు సినిమాలు తీయకపోవడమే మంచిదని అభిప్రాయపడింది. ఖురాన్, బైబిల్ వంటి అంశాల జోలికి వెళ్లవద్దని, అసలు ఏ మతం జోలికి వెళ్లవద్దని హితవు పలికింది.
దయచేసి మతాలను తప్పుగా చూపించవద్దని సూచించింది. అంతేకాదు, కోర్టుకు ఎలాంటి మతం ఉండదని జస్టిస్ రాజేశ్ సింగ్ చౌహాన్, జస్టిస్ శ్రీప్రకాశ్ సింగ్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
"ఫిలింమేకర్స్ ఎవరైనా డబ్బుల కోసమే సినిమాలు తీస్తారు. కానీ మతాల జోలికి వెళ్లొద్దు. ఖురాన్ పై ఒక చిన్న తప్పుడు డాక్యుమెంటరీ తీయండి... ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. తీవ్ర సంక్షోభం చెలరేగుతుంది" అని జస్టిస్ చౌహాన్ వివరించారు.
ఇక విచారణ సందర్భంగా, వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు, కేంద్ర సెన్సార్ బోర్డుకు అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.