అంత్యక్రియలకు రాలేదని యువతి హత్య
- ముంబైలో షాకింగ్ ఘటన
- తన సోదరుడి అంత్యక్రియలకు రానందుకు పొరుగున ఉన్న కుటుంబంపై నిందితుడి దాడి
- మొదట మహిళపై దాడి, అడ్డొచ్చిన ఆమె కూతురిని విచక్షణా రహితంగా పొడిచిన వైనం
- ఘటనా స్థలంలోనే మరణించిన యువతి, తల్లికి తీవ్రగాయాలు
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల అరెస్టు
ముంబైలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తన సోదరుడి అంత్యక్రియలకు రాలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన ఇంటికి సమీపంలో ఉండే ఓ యువతిని హత్య చేశాడు. మంగళవారం ఈ దారుణం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కృష్ణ పవార్ అనే వ్యక్తి ఘట్కోపర్-మాన్‌ఖుర్ద్ లింక్ రోడ్డు సమీపంలో నివసిస్తుంటాడు. అతడి ఇంటికి సమీపంలోనే అంజలీ భోసాలే తన కుటుంబంతో కలిసి ఉంటోంది. కాగా, కృష్ణ పవార్ మంగళవారం తన సోదరుడికి అంత్యక్రియలు నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి అంజలి కుటుంబం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కష్ణ పవార్ ఆ కుటుంబంపై పదునైన ఆయుధంతో దాడికి తెగబడ్డాడు.
తొలుత అంజలి తల్లిపై పవార్ దాడి చేశాడు. నిందితుడిని అడ్డుకోబోయిన అంజలి సోదరిని విచక్షణా రహితంగా పొడవడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. అంజలి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కృష్ణ పవార్, అతడి భార్యతో పాటూ మరో జంటను కూడా అరెస్టు చేశారు. నలుగురిపైనా హత్య, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.