సచిన్‌ను మోయలేమని చెప్పాం.. అందుకే విరాట్ కోహ్లీ భుజానికెత్తుకున్నాడు: సెహ్వాగ్
- 2011నాటి ఘటనను గుర్తు చేసుకున్న వీరేంద్ర సెహ్వాగ్
- సచిన్ చాలా బరువు ఉంటాడు.. మాకు భుజాల నొప్పులు ఉన్నందున మోయలేదని వెల్లడి
- సచిన్ ను మోసే భారాన్ని యువఆటగాళ్లకు వదిలేసినట్లు చెప్పిన వీరూ
ఈ ఏడాది చివరలో భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో 2011లో ధోనీ నేతృత్వంలో రెండోసారి ప్రపంచ కప్ నెగ్గిన క్షణాలను వీరేంద్ర సెహ్వాగ్ పంచుకున్నాడు. అప్పుడు భారత్ గెలిచిన తర్వాత మైదానంలో ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. సచిన్ ను భుజాలపైకి ఎత్తుకొని మైదానంలో మొత్తం కలియదిరిగారు. ఇందుకు సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటన సెహ్వాగ్ తెలిపారు. ఆ రోజు తాము సచిన్ ను భుజాలపై ఎక్కించుకోకవడానికి ఓ కారణముందని వెల్లడించారు.
సచిన్ చాలా బరువుగా ఉంటాడని, తామంతా ముసలోళ్లమని నవ్వుతూ చెప్పాడు. తమకు అప్పుడు భుజాల నొప్పులు కూడా ఉన్నాయన్నాడు. మరికొందరు ఆటగాళ్లకు మరికొన్ని సమస్యలు ఉన్నట్లు చెప్పాడు. అందుకే సచిన్ ను మోసే భారాన్ని యువ ఆటగాళ్లకు వదిలేశామని, మీరెళ్లి సచిన్ ను ఎత్తుకొని మైదానంలో రౌండ్ కొట్టి రండని చెప్పామని తెలిపాడు. అందుకే విరాట్ కోహ్లీ అతనిని మోసినట్లు చెప్పాడు.