యంగ్ హీరోల పారితోషికాలలో నానీదే పై చేయినట!
- పెరిగిపోతున్న యంగ్ హీరోల పారితోషికాలు
- పాన్ ఇండియా ప్రాజెక్టులే కారణమనే టాక్
- మొదటి స్థానంలో వినిపిస్తున్న పేరు నానీదేనంటూ ప్రచారం
- ఆ తరువాత స్థానాల్లో కనిపిస్తున్న విజయ్ దేవరకొండ - రామ్
ఒకప్పుడు భారీ పారితోషికం అందుకునే స్థాయికి చేరుకోవాలంటే హీరోలకు చాలా ఏళ్లు పట్టేది. సీనియర్ స్టార్ హీరోలు తీసుకునే పారితోషికాన్ని అందుకోవాలంటే ఇంకా ఎంత కాలం పడుతుందో .. ఎన్ని సక్సెస్ లు పడాలోనని యంగ్ హీరోలు అనుకునేవారు. కానీ తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి చేరుకోవడంతో, యంగ్ హీరోల పారితోషికాలు కూడా ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాయి.
సీనియర్ స్టార్ హీరోల తరువాత వరుసలో ఉన్న ప్రభాస్ .. మహేశ్ .. ఎన్టీఆర్ .. చరణ్ .. బన్నీ వంటి స్టార్స్ విషయాన్ని అలా ఉంచితే, ఆ తరువాత వరుసలో ఉన్న హీరోలలో అత్యధిక పారితోషికాన్ని అందుకునే హీరోగా నాని పేరు వినిపిస్తోంది. 'దసరా' సినిమా నుంచి ఆయన పారితోషికం మరింత పెరిగినట్టుగా చెబుతున్నారు.
ఇక ఆ తరువాత స్థానంలో విజయ్ దేవరకొండ పేరు వినిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన 'లైగర్' ఫ్లాప్ అయినా, ఆ సినిమా నుంచి విజయ్ దేవరకొండ అందుకుంటున్న పారితోషికంతో మార్పు రాలేదని అంటున్నారు. అలా నాని తరువాత స్థానంలో విజయ్ దేవరకొండ ఉన్నాడని అంటున్నారు.
ఆయన తరువాత ప్లేస్ లో రామ్ పోతినేని ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన బోయపాటి సినిమాలో చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో రామ్ గట్టిగానే పారితోషికం అందుకున్నాడని అంటున్నారు. ఆ తరువాత చేసే పూరి సినిమాకి కూడా ఇదే పారితోషికం ఉన్నా, హిట్ పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు.