రైతుల కోసం కేంద్ర క్యాబినెట్ కమిటీ కీలక నిర్ణయాలు

  • ఢిల్లీలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం
  • ప్రధాన్ మంత్రి ప్రణామ్, యూరియా గోల్డ్ స్కీమ్ ల కొనసాగింపునకు ఆమోదం
  • యూరియాపై సబ్సిడీ మరో మూడేళ్ల పాటు కొనసాగింపు
కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నేడు రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ప్రణామ్, యూరియో గోల్డ్ స్కీమ్ ల కొనసాగింపునకు పచ్చజెండా ఊపింది. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే, నేల ఉత్పాకదకతపైనా కమిటీ దృష్టి సారించింది. 

ఆహార భద్రత, పర్యావరణ సుస్థిరత తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ కేంద్రం కేటాయించిన రూ.3.70 లక్షల కోట్ల బడ్జెట్ పరిధిలో నిర్ణయాలు తీసుకుంది. 

ప్రస్తుతం ఉన్న యూరియా సబ్సిడీ పథకాన్ని మరో మూడేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించారు. 45 కిలోల యూరియా బస్తాకు రూ.242 ధరను ఇకపైనా కొనసాగించనున్నారు. 

2025-26 నాటికి 195 ఎల్ఎంటీ సంప్రదాయ యూరియాకు సమానమైన 44 కోట్ల బాటిళ్ల ఉత్పత్తి సామర్థ్యంతో 8 నానో యూరియా ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. 

గోబర్ధన్ ప్లాంట్ల నుండి సేంద్రియ ఎరువులను ప్రోత్సహించడానికి మార్కెట్ అభివృద్ధి సహాయం కోసం రూ.1451.84 కోట్లు కేటాయించారు. యూరియా గోల్డ్ పథకంలో భాగంగా సల్ఫర్ పూతతో కూడిన యూరియాను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.


More Telugu News