తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో క్షుద్రపూజల కలకలం!

  • వర్సిటీలోని లైబ్రరీ భవనం కూడలి వద్ద క్షుద్రపూజల ఆనవాళ్లు
  • అధికారుల దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థులు
  • సీసీ కెమెరాలు పనిచేయడంలేదని, సెక్యూరిటీ లేదని అంటున్న విద్యార్థులు
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో క్షుద్రపూజల కలకలం రేగింది. ఎస్వీ యూనివర్సిటీ లైబ్రరీ భవనం వద్ద నాలుగు రోడ్ల కూడలిలో క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించాయి. ముగ్గు వేసి, పుర్రె బొమ్మను చిత్రించి, పసుపు కుంకుమ చల్లినట్టుగా గుర్తించారు. 

ముగ్గు సున్నం, ఉప్పు, బొగ్గుపొడితో ముగ్గు వేసి, రక్తం, కోడిగుడ్లతో పూజలు చేసినట్టుగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వర్సిటీ ప్రాంగణంలో సీసీ కెమెరాలు సరిగా పనిచేయకపోవడం, సెక్యూరిటీ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 

వర్సిటీ పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు, సెక్యూరిటీ గార్డుల సంఖ్యను కూడా పెంచాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.


More Telugu News