ఇండియాలో జరగనున్న వన్డే వరల్డ్ కప్ లో పాక్ జట్టు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పిన వసీమ్ అక్రమ్

  • అక్టోబర్ 5న ప్రారంభం కానున్న వరల్డ్ కప్
  • పాక్ వన్డే జట్టు బలంగా ఉందన్న అక్రమ్
  • పాక్, భారత్ పరిస్థితులు ఒకేలా ఉండటం లాభిస్తుందని వ్యాఖ్య
ఇండియాలో జరగనున్న వన్డే ప్రపంచకప్ కు ఐసీసీ నిన్న షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 5న గుజరాత్ అహ్మదాబాద్ లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 15న టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.

మరోవైపు ఈ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ గెలుపోటముల గురించి ఆ దేశ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వన్డేల్లో ప్రపంచ నెంబర్ 1 బ్యాట్స్ మెన్ బాబర్ ఆజమ్ తమ జట్టు కెప్టెన్ గా ఉన్నాడని, అతనికి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు తోడుగా ఉన్నారని చెప్పారు. పాక్ వన్డే జట్టు బలంగా ఉందని అన్నారు. పాకిస్థాన్, భారత్ పరిస్థితులు ఒకేలా ఉంటాయని... ఇది పాక్ కు లాభించే అంశమని చెప్పారు. ఫిట్ గా ఉండటం, ప్లాన్ ప్రకారం ఆటను ఆడటం వంటివి చేస్తే ప్రపంచ కప్ లో పాక్ అద్భుతంగా రాణిస్తుందని అన్నారు.


More Telugu News