జీ 5లో 'మాయాబజార్ ఫర్ సేల్' వెబ్ సిరీస్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!
- జీ 5లో 'మాయా బజార్ ఫర్ సేల్'
- కామెడీ టచ్ తో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్
- గ్రేటర్ కమ్యూనిటీ ఫ్యామిలీల మధ్య నడిచే కథ
- జులై 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్
జీ 5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి మరో వినోదాత్మక వెబ్ సిరీస్ రావడానికి రెడీ అవుతోంది. ఆ వెబ్ సిరీస్ పేరే .. 'మయా బజార్ ఫర్ సేల్'. జీ 5వారితో కలిసి రానా సొంత బ్యానర్ 'స్పిరిట్ మీడియా' ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ కి రచన - దర్శకత్వం వహించింది గౌతమి చల్లగుల్ల. జులై 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇది మల్టీ స్టారర్ తెలుగు వెబ్ సిరీస్ గా చెప్పుకోవాలి. గ్రేటర్ కమ్యూనిటీలోని ఫ్యామిలీల నేపథ్యంలో నడిచే కథ ఇది. మోడ్రన్ ఫ్యామిలీస్ .. మోడ్రన్ సొసైటీని కామెడీ టచ్ తో ఆవిష్కరిస్తూ సాగే సెటైరికల్ వెబ్ సిరీస్ ఇది. మొదటి నుంచి చివరి వరకూ హాయిగా నవ్విస్తూనే ఉంటుందని అంటున్నారు.
గేటెడ్ కమ్యూనిటీలో కొన్ని ఫ్యామిలీస్ హాయిగా జీవిస్తూ ఉంటాయి. అక్కడ ఎవరి తీరు వారిది .. ఎవరి దారి వారిది. అలాంటి పరిస్థితుల్లో అది అక్రమ నిర్మాణమని చెబుతూ .. కూల్చేయవలసిందిగా ప్రభుత్వం ప్రకటిస్తుంది. అప్పుడు ఆ కమ్యూనిటీలోని వారు ఏం చేస్తారు? అనేదే కథ. నవదీప్ .. ఈషా రెబ్బా .. నరేశ్ .. ఝాన్సీ .. హరితేజ .. సునైన .. కోట శ్రీనివాసరావు .. తదితరులు ముఖ్యమైన పాత్రలను పోషించారు.