రెండు గ్రూపుల చీతాల మధ్య పోరాటం.. ఆఫ్రికన్ చీతా అగ్నికి గాయాలు
- మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్క్ లో చీతాల మధ్య పోరాటం
- చీతాకు చికిత్స కొనసాగుతోందన్న పార్క్ అధికారి
- గత ఏడాది పార్క్ లో చీతాలను వదిలిన మోదీ
మధ్యప్రదేశ్ లోని రెండు గ్రూపుల చీతాల మధ్య జరిగిన పోరాటంలో ఆఫ్రికన్ చీతా అగ్ని గాయపడింది. కూనో నేషనల్ పార్క్ ఓపెన్ ఫారెస్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని నేషనల్ పార్క్ కు చెందిన ఒక అధికారి వెల్లడించారు.
ప్రస్తుతం అగ్ని చీతాకు చికిత్స కొనసాగుతోందని... దాని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. అగ్ని చీతాను ఆఫ్రికా నుంచి తెప్పించారు. ఇది మగ చీతా. గత ఏడాది ప్రధాని మోదీ తన పుట్టినరోజు సందర్భంగా నమీబియా నుంచి తెప్పించిన 5 ఆడ, 3 మగ చీతాలను కూనో నేషనల్ పార్కులో వదిలారు.