ఉమ్మడి పౌర స్మృతి ప్రస్తావనపై ప్రధాని మోదీకి చిదంబరం కౌంటర్
- దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అవసరం గురించి మాట్లాడిన మోదీ
- యూసీసీ అమలు ఇప్పట్లో సాధ్యం కాదన్న లా కమిషన్ నివేదిక మోదీ చదవాలని సూచన
- దేశంలోని సమస్యలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు యూసీసీ ప్రస్తావన తెచ్చారని ఆరోపణ
దేశంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అవసరం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసావించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో భాగంగానే ఉమ్మడి పౌర స్మృతి ప్రస్తావన తెచ్చారని విమర్శిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరం స్పందించారు. మోదీ వ్యాఖ్యలను చిదంబరం తప్పుబట్టారు. కుటుంబాన్ని దేశంతో పోల్చడం సరికాదన్నారు. రక్త సంబంధాలతో కూడినది కుటుంబం అని, రాజ్యాంగం దేశాన్ని కలిపి ఉంచుతుందని అభిప్రాయప్డడారు.
రాజ్యాంగం అంటే రాజకీయ-చట్టపరమైన దస్తావేజు అని తెలిపారు. గత లా కమిషన్ ఇచ్చిన నివేదికలో యూసీసీ అమలు ఇప్పుడు సాధ్యం కాదని చెప్పిందన్నారు. దీనిని మోదీ చదవాలని అన్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విద్వేష నేరాలు, వివక్ష, రాష్ట్రాల హక్కుల నిరాకరణ వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే మోదీ యూసీసీ గురించి మాట్లాడుతున్నారని చిదంబరం ఆరోపించారు.