హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో రాకపోకలు బంద్

  • బక్రీద్ సందర్భంగా ఉన్నతాధికారుల నిర్ణయం
  • ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు ఏర్పాట్లు చేసిన సిబ్బంది
  • ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటూ వాహనదారులకు సూచనలు
బక్రీద్ సందర్భంగా గురువారం హైదరాబాద్ లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఓల్డ్ సిటీలోని పలు రోడ్లపై వాహనాల రాకపోకలను ఆపేయనున్నారు. ముస్లింల ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో ట్రాఫిక్ ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించనున్నట్లు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు మీరాలం ట్యాంక్‌ ఈద్గా ప్రాంతంలో వాహనాలను వేరే రూట్లకు మళ్లిస్తామని వివరించారు.

ఆంక్షలు ఉండే రూట్లు ఇవే..
  • బహదూర్‌పురా ఎక్స్‌ రోడ్డు మీదుగా ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల మధ్య పురానాపూల్‌, కామాటిపురా, కిషన్‌బాగ్‌ వైపు నుంచి ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారిని అనుమతిస్తారు.
  • జూ పార్కు, మసీద్‌ అల్హా హో అక్బర్‌ ఎదురుగా వాహనాల పార్కింగ్.. దీంతో ఈద్గా రోడ్డు వైపు రాకపోకలు ఆపేస్తారు.
  • ఆ రూట్లలోని ట్రాఫిక్‌ను బహదూర్‌పురా ఎక్స్‌ రోడ్డు వద్ద కిషన్‌బాగ్‌, కామాటిపురా, పురానాపూల్‌ వైపు మళ్లిస్తారు.
  • శివరాంపల్లి వైపు నుంచి ప్రార్థనల కోసం వచ్చే అన్ని వాహనాలను ధనమ్మ హట్స్‌ రోడ్డు నుంచి అనుమతిస్తారు. ఈద్గా వైపు వెళ్లే వాహనాలను ధనమ్మ హట్స్‌ క్రాస్‌రోడ్స్‌ నుంచి శాస్త్రిపురం, ఎన్‌ఎస్‌కుంట రూట్లకు మళ్లిస్తారు.
  • కాలాపత్తర్‌ నుంచి ఈద్గాకు వచ్చే వాహనాలను కాలాపత్తర్‌ ఠాణా, మోచీ కాలనీ, బహదూర్‌పురా వైపు మళ్లిస్తారు.
  • పురానాపూల్‌ నుంచి బహదూర్‌పురా వైపు వెళ్లే వాహనాలను పురానాపూల్‌ దర్వాజ వద్ద జియాగూడ, సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు.
  • శంషాబాద్‌, రాజేంద్రనగర్‌ వైపు నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే వాహనాలను అరాంఘర్‌ జంక్షన్‌ నుంచి మళ్లిస్తారు.


More Telugu News