బైక్ మెకానిక్ గా మారిన రాహుల్ గాంధీ.. ఫొటోలు ఇవిగో!

  • కరోల్ బాగ్ లోని బైక్ మెకానిక్ షాప్ కు వెళ్లిన రాహుల్
  • మార్కెట్ లోని వ్యాపారులు, మెకానిక్ లు, కార్మికులతో ముచ్చటించిన వైనం
  • ఈ కార్మికుల చేతులే భారత్ ను నిర్మిస్తాయన్న రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన బిజీ షెడ్యూల్ ని పక్కన పెట్టి బైక్ మెకానిక్ గా మారారు. బైక్ ను రిపేర్ చేశారు. ఢిల్లీ కరోల్ బాగ్ లోని సైకిల్ మార్కెట్ లో ఉన్న ఒక బైక్ మెకానిక్ వర్క్ షాప్ కు రాహుల్ వెళ్లారు. బైక్ ను ఎలా రిపేర్ చేయాలో మెకానిక్ లను అడిగి తెలుసుకున్నారు. సైకిల్ మార్కెట్ లోని వ్యాపారులు, మెకానిక్ లు, కార్మికులతో ముచ్చటించారు. వీటికి సంబంధించిన ఫొటోలను రాహుల్ గాంధీ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. రెంచీలను తిప్పుతూ మన దేశ చక్రాలు ముందుకు సాగేలా చేస్తున్న వారి నుంచి ఎంతో నేర్చుకున్నానని రాహుల్ వ్యాఖ్యానించారు. 

ఈ కార్మికుల చేతులే భారత్ ను నిర్మిస్తాయని రాహుల్ అన్నారు. వారి బట్టలకు అంటుకున్న గ్రీసు మన దేశ గౌరవం, ఆత్మాభిమానమని చెప్పారు. ప్రజల నాయకుడు మాత్రమే వారిని ప్రోత్సహిస్తాడని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... భారత్ జోడో యాత్ర కొనసాగుతూనే ఉందని వ్యాఖ్యానించింది. 


More Telugu News