ఉద్యోగం ఎందుకు తీసేశారని ప్రశ్నించిన మహిళ.. దిక్కున్నోడికి చెప్పుకోమన్న స్పీకర్ తమ్మినేని
- గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఘటన
- తనను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారన్న ప్రశ్నకు మండిపాటు
- తమాషాగా ఉందా? అని ఆగ్రహం
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం నెల్లిపర్తిలో నిన్న నిర్వహించిన ‘గడపగడపకు మన ప్రభుత్వం’లో స్పీకర్ తమ్మినేని సీతారాం ఓ మహిళ అడిగిన ప్రశ్నకు చిర్రెత్తిపోయారు. తమ సమస్యలు చెప్పేందుకు వేచి చూస్తున్న మహిళను పట్టించుకోకుండా ముందుకెళ్తుంటే ఆమె అడ్డుకుని తమ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. తొలుత తన అత్త పింఛన్ గురించి చెప్పగా స్పందించిన స్పీకర్ విషయాన్ని అధికారులకు చెప్పి పరిష్కరించాలని సూచించారు.
ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. తనను ఆరు నెలల క్రితం అంగన్‌వాడీ టీచర్ పోస్టు నుంచి తొలగించారని.. కారణం ఏంటని ఆమె ప్రశ్నించారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన తమ్మినేని.. ఆ విషయం తనకు తెలుసని, దిక్కున్న చోట చెప్పుకోమంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. తమాషాగా ఉందా అంటూ చిందులేసిన ఆయన.. సమస్యలు పరిష్కరిస్తానని చెబితే అది పట్టించుకోకుండా నన్నే నిలదీస్తావా? తమాషాగా ఉందా? అని మండిపడ్డారు.