'స్పై'తో నిఖిల్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం ఖాయం: చైతూ
- ఈ నెల 29వ తేదీన రిలీజ్ కానున్న 'స్పై'
- హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
- ముఖ్య అతిథిగా వచ్చిన నాగచైతన్య
- నిఖిల్ నెక్స్ట్ లెవెల్ కి వెళతాదంటూ కితాబు
నిఖిల్ హీరోగా రూపొందిన 'స్పై' సినిమా ఈ నెల 29వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో నాగచైతన్య ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదులో నిర్వహించారు. ఈ వేదికపై చైతూ మాట్లాడుతూ .. "ఎప్పుడో 'హ్యాపీడేస్' అనే సినిమాతో .. సాఫ్ట్ కేరక్టర్స్ తో తన కెరియర్ ను మొదలుపెట్టిన నిఖిల్, ఆ తరువాత 'కార్తికేయ'తో ఒక ట్రెండ్ సెట్ చేశాడు" అని అన్నాడు.
"అలాంటి నిఖిల్ మొన్నామధ్య వచ్చిన 'కార్తికేయ 2'తో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. ఆయన జర్నీ చూస్తుంటే గర్వంగా ఉంది. ఇప్పుడు 'స్పై' అనే సినిమాను తన భుజాలకు ఎత్తుకున్నాడు. నిజానికి ఈ జోనర్లో సినిమా చేయడం అంత తేలికైన విషయమేం కాదు. ఎందుకంటే హాలీవుడ్ లో ఎక్కువగా ఈ జోనర్లోనే సినిమాలు ఉంటాయి. ఆ సినిమాలను ఓటీటీలో చూసిన ఆడియన్స్ ను ఈ సినిమాతో మెప్పించడం ఒక సవాల్ లాంటిదే" అని చెప్పాడు.
"ఈ సినిమా టీజర్ .. ట్రైలర్ చూసిన తరువాత చాలా బాగా అనిపించింది. నిర్మాణ విలువలు ఏ స్థాయిలో ఉన్నాయనేది అర్థమైంది. హీరోయిన్స్ ఇద్దరి కెరియర్ కి ఈ సినిమా హెల్ప్ కావాలని కోరుకుంటున్నాను. ఈ నెల 29వ తేదీన వచ్చే ఈ సినిమాతో, నిఖిల్ నెక్స్ట్ లెవెల్ కి వెళతాడని నమ్ముతున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.