ఈటలకు కేంద్ర భద్రత.. వై కేటగిరీ భద్రత కల్పించే అవకాశం
- బీజేపీ నేతకు కేంద్ర భద్రత కోసం ప్రతిపాదనలు
- ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం
- హుజూరాబాద్ లో రాజకీయ వేడి నేపథ్యంలో ఆసక్తికరం
హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ కు కేంద్ర భద్రత కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు కేంద్ర హోంశాఖ వై కేటగిరీ భద్రతను కల్పించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు వచ్చాయని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన భార్య జమున మంగళవారం సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రూ.20 కోట్లు ఇచ్చి ఈటలను చంపిస్తానంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నట్లు తెలిసిందని ఆమె అన్నారు. కేసీఆర్ అండతో కౌశిక్ రెడ్డి రెచ్చిపోతున్నారని, అందుకే ఈటలను చంపేస్తామని తమను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని జమున ఆరోపించారు.
జమున ఆరోపణలపై కౌశిక్ రెడ్డి కూడా స్పందించారు. హత్యా రాజకీయాలు తనకు అలవాటు లేదని, అవి ఈటలకే అలవాటు అని కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేత ఈటల, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మధ్య హత్యారాజకీయ పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఈటలకు కేంద్ర హోంశాఖ వై కేటగిరీ భద్రతకు ప్రతిపాదనలు రావడం గమనార్హం.