యూకే వీసా కోసం నకిలీ సర్టిఫికెట్లు పెట్టి దొరికిపోయిన హర్యానా వాసి!
- కేసు నమోదు చేసిన సఫిడాన్ టౌన్ పోలీసులు
- ఎక్స్‌పీరియన్స్, పే-స్లిప్, ఎన్‌వోసీ అన్నీ నకిలీ పత్రాలు సమర్పించిన అనిల్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ సందర్భంగా దొరికిపోయిన వైనం
హర్యానాలోని జింద్ జిల్లాకు చెందిన సఫిడాన్ పోలీసులు యూకే వీసా దరఖాస్తులో నకిలీ పత్రాలను సమర్పించినందుకు ఒక వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని కర్నాల్ జిల్లాలోని అసంద్ పట్టణానికి చెందిన అనిల్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతను ఎక్స్‌పీరియన్స్ లెటర్, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసి), పేస్లిప్ విషయంలో నకిలీ పత్రాలను సమర్పించినట్లు తెలిపారు.
అతను యూకే వర్క్ వీసా కోసం ప్రయత్నిస్తున్నాడని, ఇందుకు నకిలీ డాక్యుమెంట్స్ ఇచ్చాడని తెలిపారు. అయితే బ్రిటిష్ హైకమిషన్ అతని వివరాలను కోరడంతో పట్టుబడ్డాడన్నారు. బ్రిటిష్ హైకమిషన్ అధికారులు అనిల్ పేర్కొన్న కంపెనీలకు వివరాలు కోరుతూ ఈ-మెయిల్ పంపడంతో మొత్తం విషయం వెలుగు చూసిందని తెలిపారు.
పానిపట్ జిల్లా మడ్లోడా పట్టణంలోని ఓ ప్రైవేట్ కంపెనీ మేనేజర్ ధ్రువ్ కుమార్ మాట్లాడుతూ... అనిల్ ఎక్స్‌పీరియన్స్ లెటర్ కోసం తమ కంపెనీ లోగోను ఉపయోగించాడని, తమ లోగోతో నకిలీ సర్టిఫికెట్ ఇచ్చాడన్నారు. కంపెనీలో పర్చేజ్ మేనేజర్‌గా చూపించి ఫేక్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ సిద్ధం చేశాడన్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సందర్భంగా కంపెనీకి ఈ-మెయిల్ పంపించడంతో అసలు ఆ సంస్థతో అనిల్ కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడైంది. దీంతో సఫిడన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కంపెనీ అధికారుల నుండి మరిన్ని వివరాలు రాబట్టామని, నిందితుడిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. దీనిని క్షుణ్ణంగా విచారిస్తున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) బల్జీత్ సింగ్ తెలిపారు.