రాష్ట్రంలో ఈ ఏడాది ఇంజినీరింగ్ సీట్లు ఖరారు చేసిన తెలంగాణ విద్యాశాఖ

  • మే 25న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు
  • జూన్ 26 నుంచి కౌన్సిలింగ్ స్లాట్ బుకింగ్
  • జులై 16 నుంచి సీట్ల కేటాయింపు
  • రేపటి నుంచి ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల నమోదు
తెలంగాణలో మే 25న ఎంసెట్ ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. జూన్ 26 నుంచి కౌన్సిలింగ్ స్లాట్ బుకింగ్ ప్రక్రియ జరుగుతోంది. జులై 12 నుంచి సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లు ఖరారు చేసింది. 

137 ప్రైవేటు కాలేజీల్లో 80,091 ఇంజినీరింగ్ సీట్లు, 16 యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీల్లో 4,713 సీట్లు, 2 ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 1,302 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఏడాది కన్వీనర్ కోటా కింద 62,079 సీట్లు కేటాయించారు. 

అత్యధికంగా సీఎస్ఈ ట్రేడ్ లో 15,897 సీట్లు, ఈసీఈలో 9,732 సీట్లు అందుబాటులో ఉంచారు. రేపటి నుంచి ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.


More Telugu News