ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ సెల్ఫీ వీడియో విడుదల చేసిన పోలీసులు

  • ఉరివేసుకున్న స్థితిలో కనిపించిన శ్యామ్
  • శ్యామ్ మృతిపై అనుమానాలు ఉంటే చెప్పాలన్న కొత్తపేట డీఎస్పీ
  • దర్యాప్తు నిష్పాక్షింగా జరుగుతోందని వెల్లడి
జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని మేడిశెట్టి శ్యామ్ మృతి వ్యవహారంపై కోనసీమ జిల్లా పోలీసులు స్పందించారు. శ్యామ్ సెల్ఫీ వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఉద్యోగం చేయలేను... అమ్మానాన్న క్షమించాలని శ్యామ్ ఆ వీడియోలో కోరాడు. ఈ సందర్భంగా కొత్తపేట డీఎస్పీ రమణ మాట్లాడుతూ, శ్యామ్ మృతిపై అనుమానాలు ఉంటే చెప్పాలని కోరారు. శ్యామ్ మృతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు. 

ఈ నెల 25న తూర్పు గోదావరి జిల్లా చింతలూరులో శ్యామ్ ను ఉరివేసుకున్న స్థితిలో గుర్తించారు. కాగా, ఉరి వేసుకోవడం వల్లే శ్యామ్ మృతి చెందినట్టు పోస్టుమార్టంలో తేలిందని కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ ను ఉటంకిస్తూ వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది. వ్యక్తిగత కారణాలతోనే 20 ఏళ్ల శ్యామ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని వెల్లడించింది. 

శ్యామ్ మృతి వెనుక వైసీపీ నేతల ప్రమేయం ఉందని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.


More Telugu News