బాలీవుడ్ నుంచి భారీ ప్రాజెక్టు .. కర్ణుడిగా సూర్య!
- 'కంగువా' ప్రాజెక్టుతో బిజీగా సూర్య
- ఇప్పటికే అంచనాలు పెంచిన ప్రాజెక్టు
- 'కర్ణ' పాత్ర ప్రధానంగా సాగే మహాభారత కథకి సూర్య ఓకే
- దర్శకత్వం వహించనున్న రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా
ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. అందువలన చారిత్రక .. పౌరాణిక చిత్రాలను అనుకున్న స్థాయిలో .. ఆశ్చర్యంలో ముంచెత్తే స్థాయిలో చిత్రీకరించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్లనే ఈ తరహా సినిమాల కోసం కోట్ల రూపాయలను గుమ్మరించడానికి బడా సంస్థలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా 'మహాభారతం' తెరకెక్కించడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి.
ఒక వైపున రాజమౌళి 'మహాభారతం' ప్రాజెక్టును ఎప్పుడు మొదలుపెడతాడా అని తెలుగు ప్రేక్షకులంతా వెయిట్ చేస్తున్నారు. కర్ణుడి పాత్రను ప్రధానంగా చేసుకుని ప్రభాస్ తో చేస్తే బాగుంటుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో ప్రాజక్టుకు సంబంధించి కర్ణుడి పాత్రధారిగా కోలీవుడ్ హీరో సూర్య పేరు తెరపైకి వచ్చింది.
బాలీవుడ్ డైరెక్టర్ రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా, కర్ణ పాత్ర ప్రధానంగా మహాభారతాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. కర్ణుడి పాత్ర కోసం ఆయన సూర్యను ఎంచుకున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం 'కంగువా' సినిమాతో సూర్య బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తికాగానే, 'కర్ణ' పాత్ర ప్రధానంగా సాగే మహాభారతంలో సూర్య నటిస్తాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.