అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్.. షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ

  • అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మ్యాచ్ లు
  • అహ్మదాబాద్ లో భారత్, పాక్ ల మధ్య మ్యాచ్
  • నవంబర్ 19న అహ్మదాబాద్ లో ఫైనల్
క్రికెట్ వరల్డ్ కప్ మెగా టోర్నీ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న తొలి మ్యాచ్ జరగనుండగా.. నవంబర్ 15న ఇదే వేదికపై ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈమేరకు వరల్డ్ కప్ షెడ్యూల్ ను మంగళవారం మధ్యాహ్నం ఐసీసీ విడుదల చేసింది. 

తొలి మ్యాచ్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. 2019 సంవత్సరంలో ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ సూపర్ ఓవర్‌లో గెలిచింది. అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో భారత క్రికెట్ జట్టు తన తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 15న పాకిస్థాన్‌తో తలపడనుంది. నవంబర్ 15, 16 తేదీలలో ముంబై, కోల్ కతాలలో సెమీ ఫైనల్ మ్యాచ్ లు నిర్వహించనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.

భారత జట్టు ఆడే మ్యాచ్ లు..
అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో
అక్టోబర్ 11న ఢిల్లీలో ఆఫ్ఘానిస్థాన్ తో
అక్టోబర్ 15న అహ్మదాబాద్ లో పాకిస్థాన్ తో 
అక్టోబర్ 19న పూణెలో బంగ్లాదేశ్ తో
అక్టోబర్ 22న ధర్మశాలలో న్యూజిలాండ్ తో
అక్టోబర్ 29న లక్నోలో ఇంగ్లాండ్ తో
నవంబర్ 2 న ముంబైలో క్వాలిఫయర్ మ్యాచ్ 
నవంబర్ 5న కోల్ కతాలో సౌత్ ఆఫ్రికా
నవంబర్ 11న బెంగళూరులో క్వాలిఫయర్ మ్యాచ్


More Telugu News