బాలయ్య సరసన మరోసారి నయనతార!
- బాలయ్యతో 3 సినిమాలు చేసిన నయన్
- ఇప్పుడు 4వ సినిమాకి ఓకే చెప్పిందని టాక్
- ఈ సినిమాకి దర్శకుడు బాబీ
- సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచన
తమిళంలో వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్న నయనతార, తెలుగులో మాత్రం సీనియర్ స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే డేట్స్ సర్దుబాటు చేస్తోంది. ముఖ్యంగా ఆమె ఇక్కడ చిరంజీవి - బాలకృష్ణ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ వెళుతోంది. తాజాగా ఆమె మరోసారి బాలకృష్ణ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేది సమాచారం.
ప్రస్తుతం బాలయ్య తన 108వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు. 'భగవంత్ కేసరి' టైటిల్ ను ఖరారు చేసుకున్న ఈ సినిమా, ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాను బాబీ దర్శకత్వంలో చేయడానికి బాలయ్య అంగీకరించారు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరిగిపోతూనే ఉన్నాయి.
ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు ఉందనేది టాక్. ఒక కథానాయికగా నయనతారను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 'సింహా' .. శ్రీరామరాజ్యం' .. 'జై సింహా' తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో సెట్స్ పైకి వెళుతున్న సినిమా ఇది. ఇక మరో కథానాయిక పాత్ర కోసం రకుల్ .. సంయుక్త మీనన్ పేర్లను పరిశీలిస్తున్నారట. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.