ఎంపీ కిడ్నాప్ ఎఫెక్ట్.. గన్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకున్న గుడివాడ అమర్ నాథ్

  • ఇటీవల విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్
  • గన్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకున్న ఎంపీ, ఆయన కుమారుడు
  • విశాఖలో దాదాపు 600 మందికి గన్ లైసెన్స్ లు ఉన్నట్టు సమాచారం
విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు కిడ్నాప్ కు గురైన అంశం ఏపీలో రాజకీయ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. సాక్షాత్తు ఒక ఎంపీ కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది. మరోవైపు గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ఎంవీవీకి, ఆయన కుమారుడికి పోలీసులు సూచించగా... ఇద్దరూ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకున్నారు. 

మరోవైపు మంత్రి గుడివాడ అమర్ నాథ్ కూడా తుపాకీ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. పలువురు ఇతర నేతలు కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం విశాఖపట్నం నగరంలో దాదాపు 600 మందికి గన్ లైసెన్స్ లు ఉన్నాయి. వీరిలో 400 మందికి పైగా మాజీ సైనికులే. వీరిలో ఎక్కువ మంది సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. 200 మంది వరకు రాజకీయ, వ్యాపార ప్రముఖులకు లైసెన్స్ లు ఉన్నాయి. గన్ లైసెన్స్ పొందాలంటే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, స్పెషల్ బ్రాంచ్ నుంచి ఎన్ఓసీ పొందాల్సి ఉంటుంది.


More Telugu News