ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపే కుట్ర చేస్తున్నారు: దస్తగిరి
- వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి
- పిల్లాడిని కిడ్నాప్ చేసి హింసించినట్టు కేసు నమోదు
- భార్య షబానాతో కలిసి ఎస్పీకి ఫిర్యాదు
తనను ఎలాగైనా జైలుకు పంపాలని వైసీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు దస్తగిరి ఆరోపించారు. తనను ఏదో ఒక కేసులో ఇరికించి ప్లాన్ అమలు చేయాలని చూస్తున్నారని అన్నారు. పులివెందులలో ఓ పిల్లాడిని తాము నిర్బంధించి హింసించామని తమపై తప్పుడు కేసు పెట్టారంటూ భార్య షబానాతో కలిసి నిన్న ఆయన జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరులు, వైసీపీ నేతలు తమను బెదిరిస్తున్నట్టు చెప్పారు. నిజంగానే తానేవైనా సెటిల్‌మెంట్లు చేసినా, ఎవరినైనా బెదిరించినా ఆ విషయం తన వద్దనున్న గన్‌మెన్‌కు తెలుస్తుంది కదా? అని ప్రశ్నించారు. తనపై పెట్టిన తప్పుడు కేసు గురించి సీబీఐ ఎస్పీకి, జిల్లా న్యాయమూర్తికి లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్టు దస్తగిరి తెలిపారు.