సీనియర్ నటుడు అర్జున్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు

  • అర్జున్ కుమార్తె ఐశ్వర్యకు నటుడు తంబి రామయ్య కుమారుడితో వివాహం
  • వచ్చే ఏడాది పెళ్లి జరుగుతుందన్న తంబి రామయ్య
  • తంబి రామయ్య కుమారుడు ఉమాపతి కూడా నటుడే!
సీనియర్ నటుడు అర్జున్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం కోలీవుడ్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో జరగనుంది. అర్జున్ గతంలో ఓ టీవీ షోకి హోస్ట్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో తంబి రామయ్య కుమారుడు ఉమాపతి ఓ కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. ఆ కార్యక్రమం నుంచి అర్జున్, తంబి రామయ్య కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. 

ఉమాపతి కూడా సినీ నటుడే. కాగా, అర్జున్ కుమార్తె ఐశ్వర్యను ఇష్టపడుతున్నట్టు ఉమాపతి తన తల్లిదండ్రులకు చెప్పడం, వారు అర్జున్ కుటుంబ సభ్యులతో మాట్లాడడం చకచకా జరిగిపోయాయి. నవంబరు 8న ఉమాపతి పుట్టినరోజు కాగా, అదే రోజున పెళ్లి జరిగే తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. వచ్చే ఏడాది పెళ్లి జరగొచ్చని తంబి రామయ్య తెలిపారు.


More Telugu News