పవన్‌కు కొట్టించుకోవడం.. తిట్టించుకోవడం అలవాటే: ఏపీ మంత్రి కాకాణి
- పవన్‌కు బట్టలూడదీసినట్లు బుద్ధి చెప్పారన్న మంత్రి
- ఆ భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారని ఆగ్రహం
- లోకేశ్ పాదయాత్ర జనం లేక వెలవెలపోతోందన్న కాకాణి
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారని, గతంలో రెండుచోట్ల ఓడించి బట్టలూడదీసినట్లు బుద్ధి చెప్పారని, అందుకే ఇలాంటి భాషను వాడుతున్నట్లుగా ఉందన్నారు. పవన్ కు జనాలతో కొట్టించుకోవడం, తిట్టించుకోవడం అలవాటుగా మారిందన్నారు. తీవ్ర ఒత్తిడిలో పవన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
మంత్రి కాకాణి సాక్షితో మాట్లాడుతూ... టీడీపీ యువనేత నారా లోకేశ్ పై కూడా మండిపడ్డారు. లోకేశ్ యువగళం పాదయాత్ర అడ్రస్ లేనిదని, అందుకే జనం లేక వెలవెలపోతోందన్నారు. రాత్రిది దిగకపోవడం వల్ల హ్యాంగోవర్ అయి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఓ లక్ష్యమంటూ లేకుండా రాత్రిపూట వాక్ చేస్తూ, పాదయాత్ర అని ప్రచారం చేసుకుంటున్నాడని విమర్శించారు. మంత్రులం, ఎమ్మెల్యేలం చేసే సవాళ్లకు లోకేశ్ నుంచి ఎలాంటి సమాధానాలు రావడం లేదన్నారు. పవన్, లోకేశ్.. ఇరువురు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారన్నారు.