'ఆదిపురుష్' నుంచి 'రామ్ .. సీతారామ్' తెలుగు ఫుల్ సాంగ్!
- ఈ నెల 16న విడుదలైన 'ఆదిపురుష్'
- 10 రోజుల్లో 450 కోట్ల గ్రాస్ వసూలు
- 500 కోట్ల మార్క్ దిశగా అడుగులు
- అజయ్ - అతుల్ బాణీలలో ఇదే హైలైట్
'రామాయణం' కథతో ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓం రౌత్ 'ఆదిపురుష్' సినిమాను రూపొందించాడు. ఈ నెల 16వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలైంది. సీతాదేవిగా కృతి సనన్ నటించిన ఈ సినిమాలో, సైఫ్ అలీ ఖాన్ .. సన్నీ సింగ్ .. దేవ్ దత్త ప్రధానమైన పాత్రలను పోషించారు.
అజయ్ - అతుల్ ఈ సినిమాకి బాణీలను అందించారు. ఈ సినిమాలోని పాటలలో 'రామ్ సీతా రామ్' పాట ఎక్కువగా ఆకట్టుకుంది. సీతారాములపై చిత్రీకరించిన ఈ పాటకి, సాహిత్యంతో పాటు మంచి విజువల్స్ తోడయ్యాయి. సినిమాలోని డైలాగ్స్ లో రాఘవ - జానకి అంటూ వింటూ వచ్చిన ప్రేక్షకులకు, ఈ పాటలో సీత - రామ్ అని వినిపించగానే మనసు ఊరట చెందుతుంది.
అలాంటి ఈ పాట తెలుగు వెర్షన్ ను కొంతసేపటి క్రితం విడుదల చేశారు. 'ఆదియు అంతము రాముడిలోనే .. మా అనుబంధము రాముడితోనే' అంటూ కాస్త ఎమోషనల్ గా కూడా ఈ పాట కనెక్ట్ అవుతుంది. 10 రోజుల్లో 450 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, 500 కోట్ల దిశగా వెళుతోంది.