ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
- ఆచితూచి వ్యవహరించిన ఇన్వెస్టర్లు
- 9 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 26 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని ఫ్లాట్ గా ప్రారంభించాయి. ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. చివరకు సెన్సెక్స్ 9 పాయింట్ల నష్టంతో 62,970 పాయింట్ల వద్ద ముగియగా... నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 18,691 వద్ద స్థిరపడింది. రష్యాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, వడ్డీ రేట్లు పెంచుతామంటూ అమెరికా ఫెడ్ రిజర్వ్ సంకేతాలను ఇవ్వడం, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లను పెంచడం వంటి పరిణామాలతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (1.67%), టాటా మోటార్స్ (1.54%), టైటాన్ (1.14%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.99%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.56%).
టాప్ లూజర్స్:
టీసీఎస్ (-0.86%), రిలయన్స్ (-0.84%), ఎన్టీపీసీ (-0.70%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.64%), ఎల్ అండ్ టీ (-0.55%).