అప్పుడు పొరపాటు చేశానని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది: డైరెక్టర్ దశరథ్

  • రచయితగా ఎంట్రీ ఇచ్చిన దశరథ్
  • 'చిత్రం' సినిమాతో మంచి పేరు వచ్చిందని వ్యాఖ్య   
  • 'సంతోషం'తో దర్శకుడిగా అందుకున్న సక్సెస్ 
  • దర్శకుడిని కావాలనే ఉద్దేశంతోనే వచ్చానని వెల్లడి
రచయితగా .. దర్శకుడిగా దశరథ్ కి మంచి అనుభవం ఉంది. తేజ దగ్గర స్క్రిప్ట్ విభాగంలో పనిచేసిన ఆయన, 'సంతోషం' .. 'మిస్టర్ పెర్ఫెక్ట్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దశరథ్ మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు.

తేజ 'చిత్రం' సినిమాకి నేను రైటింగ్ సైడ్ వర్క్ చేశాను. అప్పటికే నేను వెర్షన్ రైటర్ గా బిజీ. 'చిత్రం' తరువాత పూర్తిగా నన్నే డైలాగ్స్ రాయమని చాలామంది అడిగేవారు. అలా రాస్తే అప్పట్లో తక్కువలో తక్కువ 8 లక్షల నుంచి 15 లక్షల వరకూ ఇచ్చేవారు. చాలా పెద్ద పెద్ద బ్యానర్ల నుంచి అవకాశాలు వచ్చాయి. కానీ నేను డైరెక్టర్ ను కావాలనే ఉద్దేశంతో అంత సీరియస్ గా తీసుకోలేదు" అని అన్నారు. 

మంచి రచయిత మాత్రమే మంచి దర్శకుడు కాగలడని నేను నమ్ముతాను. అందువల్లనే నేను పరుచూరి బ్రదర్స్ దగ్గర 15 సినిమాలకి పనిచేశాను. అందువలన నేను చాలామందికి తెలుసు. వాళ్లంతా కూడా రైటర్ గా వాళ్ల సినిమాలకి పనిచేయమని అడిగారు. ఆ అవకాశాలను వదులుకుని నేను తప్పు చేశానని ఇప్పుడు బాధపడుతూ ఉంటాను" అంటూ చెప్పుకొచ్చారు.  



More Telugu News