కాంగ్రెస్ లోకి వెళుతున్నాం కాబట్టే రేణుకా చౌదరితో మాట్లాడాం: పొంగులేటి
- బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన పొంగులేటి
- తొలుత బీజేపీలోకి వెళతారని ప్రచారం
- అయితే కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్న ఖమ్మం జిల్లా నేత
- త్వరలో హస్తం పార్టీలో చేరేందుకు నిర్ణయం
బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది. ఆయన తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరితో అరగంటకు పైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటిని మీడియా పలకరించింది.
తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నాను కాబట్టే మేడమ్ తో సమావేశమయ్యానని, ఈ సమావేశానికి అంతకంటే ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. రేణుకా చౌదరితో ఇతర అంశాలేవీ చర్చించలేదని, పార్టీలోకి తాము వస్తున్న విషయం గురించే మాట్లాడినట్టు వెల్లడించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా కలుస్తానని పొంగులేటి వివరించారు.
మరో బీఆర్ఎస్ బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాగా, పొంగులేటి, జూపల్లి తొలుత బీజేపీలోకి వెళతారని ప్రచారం జరిగింది. వారితో పలుమార్లు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమావేశమైనా, ఆ చర్చలు ఫలప్రదం కాలేదు. అయితే, పొంగులేటి, జూపల్లిని ఆకర్షించడంలో కాంగ్రెస్ నేతలు సఫలమైనట్టు ఇటీవలి పరిణామాలు వెల్లడిస్తున్నాయి.