నేను దగ్గరికి రానీయనిది అదొక్కటే: 'జబర్దస్త్' అప్పారావ్
- 'జబర్దస్త్'తో పేరు తెచ్చుకున్న అప్పారావ్
- ప్రస్తుతం సినిమాలతో బిజీ బిజీ
- తనకి హెల్ప్ చేసింది షకలక శంకర్ అని వెల్లడి
- అహంభావానికి దూరంగా ఉండాలని వ్యాఖ్య
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన కమెడియన్స్ లో అప్పారావ్ ఒకరు. ఆయన డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటాయి. ప్రస్తుతం ఆయన సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ ను గురించిన అనేక విషయాలను పంచుకున్నాడు.
''1984 నుంచి నేను నాటకాలలో నటించడం మొదలుపెట్టాను. అలా కొంతకాలం పాటు రంగస్థలంపై నటిస్తూ వెళ్లిన నేను, ఆ తరువాత 'శుభవేళ' అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాను. చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ వెళుతున్న నన్ను, 'షకలక శంకర్' జబర్దస్త్ కామెడీ షోకి పరిచయం చేశాడు. ఈ రోజున నేను ఇక్కడి వరకూ రావడానికి కారణం ఆయనే" అని అన్నాడు.
"ఎవరైనా సరే చదువు పూర్తిచేసిన తరువాతనే నటన వైపు రావడం మంచిదనేది నా అభిప్రాయం. నాకు 'జబర్దస్త్' సెలబ్రిటీ హోదాను ఇచ్చింది. అలా అని చెప్పేసి నేను ఎప్పుడూ గర్వంతో ఎగిరిపడలేదు. గర్వాన్ని మించిన శత్రువు లేదనేది నా అభిప్రాయం. దానిని మాత్రం నేను ఎప్పుడూ దగ్గరికి రానీయను" అంటూ చెప్పుకొచ్చారు'