వన్డే క్రికెట్ లో అత్యధిక మ్యాచ్ లు ఓడిన జట్టు ఏదంటే..!
- అత్యధిక వన్డేలు ఆడిన రికార్డు ఇండియాదే
- మొత్తంగా మన జట్టు ఆడిన వన్డే మ్యాచ్ లు 1029
- ఇందులో 490 మ్యాచ్ లలో ఓటమి
- 441 వన్డేల్లో ఓటమితో రెండో స్థానంలో శ్రీలంక టీమ్
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్ లు ఆడిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. అదే సమయంలో వన్డేల్లో అత్యధిక ఓటములు చవిచూసిన జట్టుగానూ నిలిచింది. మొత్తంగా భారత జట్టు ఇప్పటి వరకు 1029 వన్డే మ్యాచ్ లు ఆడగా అందులో 490 మ్యాచ్ లు ఓడిపోయింది. వన్డేల చరిత్రలో ప్రపంచంలో మరే జట్టు కూడా వెయ్యి మ్యాచ్ లు ఆడలేదు. టీమిండియా తర్వాతి స్థానంలో 978 వన్డే మ్యాచ్ లు ఆడిన ఆస్ట్రేలియా జట్టు ఉంది. దాయాది పాకిస్థాన్ జట్టు 953 మ్యాచ్ లతో మూడో స్థానంలో ఉంది.
వన్డే మ్యాచ్ ల ఓడిన జట్ల రికార్డు..
వన్డే మ్యాచ్ ల ఓడిన జట్ల రికార్డు..
- 889 మ్యాచ్ లు ఆడిన శ్రీలంక జట్టు 441 మ్యాచ్ లలో ఓటమి పాలై భారత జట్టు తర్వాతి స్థానంలో నిలిచింది.
- పాకిస్థాన్ మొత్తం 953 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 421 మ్యాచ్ లలో ఓడిపోయి మూడోస్థానంలో ఉంది.
- నాలుగో స్థానంలో వెస్టిండీస్ నిలిచింది. మొత్తం 860 మ్యాచ్ లు ఆడింది. అందులో 404 మ్యాచ్ లు ఓడిపోయింది.
- ఐదో స్థానంలో జింబాబ్వే జట్టు ఉంది. ఈ జట్టు మొత్తం 562 వన్డే మ్యాచ్ లు ఆడి 392 మ్యాచ్ లలో ఓడింది.
- న్యూజిలాండ్ టీమ్ 804 మ్యాచ్ లు ఆడి 386 మ్యాచ్ లలో ఓటమి పాలై ఆరో స్థానంలో నిలిచింది.
- ఆస్ట్రేలియా టీమ్ మొత్తం 978 మ్యాచ్ లు ఆడి 341 మ్యాచ్ లలో ఓడింది. ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉంది.
- మొత్తంగా 412 మ్యాచ్ లు ఆడిన బంగ్లాదేశ్ జట్టు 252 మ్యాచ్ లలో ఓటమిపాలై ఎనిమిదో స్థానంలో నిలిచింది.
- దక్షిణాఫ్రికా టీమ్ 654 వన్డే మ్యాచ్ లలో 228 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉంది.