తెలంగాణ యాసలో జగపతిబాబు విజృంభణ .. 'రుద్రంగి' ట్రైలర్ రిలీజ్!
- తెలంగాణ నేపథ్యంలో సాగే 'రుద్రంగి'
- దొర పాత్రలో కనిపిస్తున్న జగపతిబాబు
- ఆయన పాత్రనే ఈ సినిమాకి కీలకం
- జులై 7వ తేదీన థియేటర్లకు రానున్న సినిమా
తెలంగాణ నేపథ్యంలో ఇంతవరకూ చాలానే సినిమాలు వచ్చాయి. అదే నేపథ్యంతో ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే 'రుద్రంగి'. నాయిక ప్రధానమైన కథాకథనాలతో సాగే సినిమా ఇది. జులై 7వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. భీమ్ రావ్ దేశ్ ముఖ్ అనే కీలకమైన పాత్రలో జగపతిబాబు కనిపించారు. ఆయన పాత్ర మేనరిజాన్ని డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టుగా ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. తెలంగాణ యాసలో జగపతిబాబు చెప్పే డైలాగ్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. 'పంతానికొస్తే అంతం చూస్తాడురా ఈ భీం రావ్ దొరా' అనే డైలాగ్ ఆయన పాత్ర స్వభావానికి అద్దం పడుతోంది.
చాలా కాలం తరువాత జగపతిబాబు డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్న సినిమాగా 'రుద్రంగి' గురించి చెప్పుకోవచ్చు. ఇతర ముఖ్య తారాగణంగా విమల రామన్ .. మమత మోహన్ దాస్ .. కాలకేయ ప్రభాకర్ .. ఆషిశ్ గాంధీ కనిపిస్తున్నారు. రసమయి బాలకిషన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించాడు.