హిమాచల్ ప్రదేశ్ లో ఫ్లాష్ ఫ్లడ్స్.. చిక్కుకుపోయిన 200 మంది టూరిస్టులు.. వీడియో ఇదిగో!

  • కుండపోత వర్షాలకు మండి జిల్లాలో ముంచెత్తిన వరద
  • బాఘి బ్రిడ్జి పైనుంచి ప్రమాదకరంగా ప్రవాహం
  • నిలిచిపోయిన వాహనాల రాకపోకలు
హిమాచల్ ప్రదేశ్ లోని పలు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షానికి పలు నదుల్లో నీటి ప్రవాహం పెరిగిపోయింది. మండి జిల్లాలో బాఘి బ్రిడ్జి చుట్టుపక్కల ప్రాంతాలను ఫ్లాష్ ఫ్లడ్స్ ముంచెత్తాయి. బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో పరాషర్ వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులతో పాటు పర్యాటకులు మొత్తం 200 మంది చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.

ఛంబా నుంచి విద్యార్థులతో మండి వస్తున్న బస్సు, పరాషర్ నుంచి తిరిగి వస్తున్న టూరిస్టుల వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయని పోలీసులు తెలిపారు. వరద తగ్గేవరకు బ్రిడ్జి దాటే పరిస్థితి లేదని వివరించారు. ఈ క్రమంలో వాహనాలలో చిక్కుకుపోయిన వారు ఆదివారం రాత్రి అక్కడే ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మరోవైపు, పండోహ్-మండి జాతీయ రహదారిపై పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని ఆర్ అండ్ బి అధికారులు తెలిపారు. దీంతో జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసేసి పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు వివరించారు.


More Telugu News