రేవంత్ బీజేపీ కోవర్ట్.. చంద్రబాబుకు తొత్తు: దాసోజు శ్రవణ్
- కాంగ్రెస్ ను భ్రష్టు పట్టించేందుకే రేవంత్ పీసీసీ అధ్యక్షుడయ్యాడంటూ శ్రవణ్ విమర్శలు
- రాష్ట్రానికి రావాల్సిన నిధల కోసమే కేంద్ర మంత్రులను కేటీఆర్ కలిశారని వ్యాఖ్య
- శునకాన్ని కనకపు సింహాసనంపై కూర్చోబెట్టినట్టు ఉందని ఎద్దేవా
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ బీజేపీ కోవర్ట్ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించడం కోసమే ఆయన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తొత్తుగా ఉంటూ ఆయన కోవర్టు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోవడానికే ఢిల్లీలో కేంద్ర మంత్రులను కేటీఆర్ కలిశారని... దీనిపై రేవంత్ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను తెచ్చేందుకే కేంద్ర మంత్రులను కేటీఆర్ కలిశారని చెప్పారు.
రేవంత్ తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని దొంగచాటుగా ఎందుకు కలిశారో చెప్పాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. రేవంత్ ప్రవర్తన చూస్తుంటే శునకాన్ని తీసుకెళ్లి కనకపు సింహాసనంపై కూర్చోబెట్టినట్టు ఉందని ఎద్దేవా చేశారు. మరోవైపు, రేవంత్ వ్యవహారశైలితో విభేదించి కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రవణ్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.