సర్ఫరాజ్ ఖాన్ ను టీమిండియాకు ఎంపిక చేయకపోవడానికి కారణం ఇదేనా?
- దేశవాళీల్లో విశేషంగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్
- జాతీయ జట్టుకు ఇంకా ఎంపిక కాని వైనం
- అతడి ప్రవర్తన సరిగా లేదంటున్న ఓ బీసీసీఐ అధికారి!
- సర్ఫరాజ్ క్రమశిక్షణతో మెలగాలని హితవు!
గత కొంతకాలంగా వివిధ పర్యటనలకు టీమిండియాను ప్రకటించినప్పుడల్లా సర్ఫరాజ్ ఖాన్ పేరు తెరపైకి వస్తూనే ఉంది. దేశవాళీ క్రికెట్లో పరుగుల వర్షం కురిపిస్తూ, వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న ముంబయి బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటిదాకా జాతీయ జట్టుకు ఎంపిక కాకపోవడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కొన్నిరోజుల కిందట వెస్టిండీస్ పర్యటన కోసం ఎంపిక చేసిన టీమిండియా జట్టులోనూ సర్ఫరాజ్ కు స్థానం లభించలేదు. గవాస్కర్ అంతటివాడు కూడా సెలెక్టర్ల తీరును తప్పుబట్టారు. టీమిండియాకు ఎంపిక కానప్పుడు సర్ఫరాజ్ ఇంకా రంజీల్లో ఆడడంలో అర్థమేముందని అన్నారు.
సర్ఫరాజ్ ఖాన్ ఫిట్ నెస్ పై దృష్టి సారించాల్సి ఉందని ఆ అధికారి పేర్కొన్నాడు. ముఖ్యంగా, మైదానంలోనూ, వెలుపల అతడి నడవడిక బాగా లేదని అన్నాడు. సెంచరీ చేసిన తర్వాత అతడి చేష్టలు సరిగా లేవని అభిప్రాయపడ్డాడు. సర్ఫరాజ్ ఖాన్ క్రమశిక్షణతో ఉండడం అలవర్చుకోవాలని హితవు పలికాడు.
ఇటీవల ఓ రంజీ మ్యాచ్ లో సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్... ఆ మ్యాచ్ చూసేందుకు వచ్చిన చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మకు వేలు చూపిస్తూ, తనను ఎందుకు ఎంపిక చేయరంటూ తన హావభావాలతో దాదాపు సవాల్ చేసినంత పనిచేశాడు. ఇలాంటివే కొన్ని చర్యలతో సర్ఫరాజ్ సెలెక్టర్ల ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తోంది.