నాలుగేళ్ల తర్వాత కొత్తగా లబ్దిదారులను గుర్తిస్తాం అనడం మోసం కాదా?: లోకేశ్
- నాయుడుపేట చేరుకున్న యువగళం పాదయాత్ర
- గాంధీ మందిరం సెంటర్ లో బహిరంగ సభ
- జగన్ వారానికో కొత్త స్టిక్కర్ అంటిస్తున్నాడన్న లోకేశ్
- జగన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడని వ్యాఖ్యలు
- సీఎంను ప్రజలు ఛీ కొడుతున్నారని విమర్శలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సూళ్లూరుపేట నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సాయంత్రం ఆయన పాదయాత్ర నాయుడుపేట చేరుకుంది. లోకేశ్ రాకతో నాయుడుపేట వీధులన్నీ జనసంద్రంగా మారాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు లోకేశ్ కు ఘనస్వాగతం పలికారు. నాయుడుపేట గాంధీ మందిరం సెంటర్ లో నిర్వహించిన బహిరంగసభకు జనం క్రిక్కిరిసిపోయారు. ఈ సభలో లోకేశ్ సీఎం జగన్, ఇతర వైసీపీ నేతలపై నిప్పులు చెరిగే ప్రసంగం చేశారు. లోకేశ్ ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
పుణ్యభూమి సూళ్లూరుపేట
సూళ్లూరుపేట నియోజకవర్గం యూత్ పవర్ సూపర్. చెంగాళమ్మ దేవాలయం ఉన్న పుణ్య భూమి సూళ్లూరుపేట స్పేస్ రీసెర్చ్ లో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఇక్కడ ఉంది. నేలపట్టులో పక్షులు, పులికాట్ సరస్సు లాంటి ప్రకృతి అందాలు సూళ్లూరుపేట సొంతం. పవిత్ర నేల సూళ్లూరుపేట గడ్డపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.
తాడేపల్లి సైకో వారానికో కొత్త స్టిక్కర్ అంటిస్తున్నాడు!
యువగళం ప్రారంభం అయ్యి 137 రోజులు అయ్యింది. ఈ 137 రోజుల్లో జగన్ అరడజను కార్యక్రమాలు ప్రకటించాడు. ఏదీ సక్సెస్ కాలేదు. జగన్ కార్యక్రమాలకి జనం రావడం లేదు. అన్ని కార్యక్రమాలు ఫెయిల్ అవుతున్నాయి. అందుకే జగన్ వారానికో కొత్త స్టిక్కర్ అతికిస్తున్నాడు. బాబు అంటే బ్రాండ్... జగన్ అంటే జైలు. సీబీఎన్ అంటే డెవలప్ మెంట్... జగన్ అంటే డిస్ట్రక్షన్. బాబు గారిని చూస్తే కియా గుర్తొస్తుంది... జగన్ ని చూస్తే కోడికత్తి గుర్తొస్తుంది.
జగన్ ను ప్రజలు ఛీ కొడుతున్నారు!
మా నమ్మకం నువ్వే కార్యక్రమం అన్నాడు. తల్లి, చెల్లిని నమ్మని వాడిని మేము ఎలా నమ్ముతాం అంటూ ప్రజలు ఛీ కొట్టారు. వెంటనే స్కీం మార్చాడు... మా భవిష్యత్తు నువ్వే కార్యక్రమం స్టార్ట్ చేశాడు. ప్రతి ఇంటికి స్టిక్కర్లు అతికించాడు. నాలుగేళ్లుగా ఈయన పీకింది ఏమి లేదని ఆ స్టిక్కర్లను ప్రజలు పీకి డ్రైనేజ్ లో పడేశారు.
అది ఫెయిల్ అయ్యే సరికి జగన్ కి చెబుదాం అని కొత్త కార్యక్రమం ప్రకటించాడు. నాలుగేళ్లుగా చెప్పి చెప్పి అలిసిపోయాం ఇక చెప్పేది ఏమీ లేదు అంటూ జనాలు చెప్పులు చూపించారు. అదీ అయిపోయింది. అప్పుడు గడప గడపకు ప్రభుత్వం అన్నాడు. గడప గడపకు వెళ్లిన ఎమ్మెల్యేలు, జనాలు జగన్ ని తిట్టే తిట్లు వినలేక పారిపోయారు. అది సక్సెస్ కాలేదు... ఇప్పుడు సురక్ష కార్యక్రమం మొదలుపెట్టాడు.
జగన్ లో భయం మొదలైంది!
99 శాతం హామీలు నెరవేర్చాను, అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి అని బిల్డప్ ఇచ్చాడు. నాలుగేళ్లు కాలక్షేపం చేసి ఇప్పుడు కొత్తగా లబ్దిదారులను గుర్తిస్తాం అనడం మోసం కాదా? ఫైనల్ గా వై ఏపీ నీడ్స్ సైకో అని ఇంకో కొత్త కార్యక్రమం ప్రకటించాడు.
ఒక్క ఛాన్స్ ఇస్తేనే అర గుండు కొట్టాడు. ఇంకో ఛాన్స్ ఇస్తే పూర్తిగా రాష్ట్రానికి గుండు కొడతాడు అని భయపడి ప్రజలు వీ డోంట్ నీడ్ సైకో అంటున్నారు. జగన్ భయపడుతున్నాడు, జగన్ టెన్షన్ లో ఉన్నాడు, జగన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. అందుకే నాపై కోడిగుడ్లు వెయ్యమని సైకో సైన్యాన్ని పంపాడు.
అక్రమాలకు అడ్డాగా మార్చేసిన సంజీవయ్య
అక్రమ ఇసుక రవాణా, గ్రావెల్ దందా, అక్రమ బియ్యం రవాణా, లిక్కర్ దందా, గంజాయి, క్రికెట్ బెట్టింగ్ కి సూళ్లూరుపేటని అడ్డాగా మార్చేశారు ఎమ్మెల్యే సంజీవయ్య. ఆయన్ని నియోజకవర్గంలో ముద్దుగా కమల్ హాసన్ అని పిలుస్తారట. బయట నటన అంత బాగుంటుంది అంట. కానీ ఇంట్లోకి వెళ్లగానే అపరిచితుడులా మారిపోయి ఇచ్చిన హామీలు అన్ని మర్చిపోతారట.
సూళ్లూరుపేట కమల్ హాసన్ గారి నటనకి పడిపోయి అప్పులు చేసి మరీ రెండుసార్లు గెలిపించుకున్న కార్యకర్తలు, నాయకులు ఇప్పుడు ఆయన నిజస్వరూపం తెలుసుకొని అందరూ జంప్ అవుతున్నారు. సంజీవయ్య గారి అనుచరుడు అనిల్ కుమార్ రెడ్డి క్రికెట్ బెట్టింగ్, గంజాయి మాఫియాని నడుపుతున్నాడు. ఇతను గతంలోనే క్రికెట్ బెట్టింగ్ లో 6 నెలలు జైల్లో ఉన్నాడు.
సూళ్లూరుపేట కమల్ హాసన్ గారు అనుచరులతో కలిసి శ్రీ సిటీ బార్డర్ లో పేకాట క్లబ్బులు కూడా నిర్వహిస్తున్నారు. సూళ్లూరుపేట కమల్ హాసన్ కరోనాని కూడా క్యాష్ చేసుకున్నారు. శ్రీసిటీ, మేనకూరు సెజ్ ల్లో ఉన్న కంపెనీల దగ్గర డబ్బులు వసూలు చేసి మింగేశారు.
తమిళనాడుకు అక్రమ ఇసుక రవాణా
సూళ్లూరుపేట కమల్ హాసన్ సొంత రైస్ మిల్లు నుండే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తమిళనాడుకి తరలిస్తున్నారు. స్వర్ణముఖి, కాళింగనది ని ఏటిఎస్ లా (ఎనీ టైం శాండ్) మార్చుకున్నారు. ఇసుకను అక్రమంగా తమిళనాడుకి తరలిస్తున్నారు. శిరసనంభేడు కొండకి గుండు కొట్టారు. కోట్ల రూపాయల గ్రావెల్ దోచేశారు. జగన్ జే బ్రాండ్లు దింపితే సూళ్లూరుపేట కమల హాసన్ కే బ్రాండ్లు దింపాడు. కర్ణాటక మద్యం తెచ్చి అనుచరులు అమ్మేస్తున్నారు.
*యువగళం పాదయాత్ర వివరాలు*
*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 1786.8 కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం 16.1 కి.మీ.*
*138వ రోజు పాదయాత్ర వివరాలు (26-6-2023):*
*సూళ్లూరుపేట/గూడూరు అసెంబ్లీ నియోజకవర్గాలు (తిరుపతి జిల్లా):*
సాయంత్రం
3.00 – అన్నమేడు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
3.05 – అన్నమేడులో రైతులతో రచ్చబండ కార్యక్రమం.
3.45 – వేముగుంటపాలెంలో స్థానికులతో సమావేశం.
4.15 – వేముగుంటపాలెం కాలువకట్ట వద్ద స్థానికులతో సమావేశం.
4.20 – మడపాలెంలో స్థానికులతో సమావేశం.
4.30 – గునపాటిపాలెం వద్ద పాదయాత్ర గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
4.35 – గునపాటిపాలెంలో స్థానికులతో సమావేశం.
5.25 – పెళ్లకూరులో స్థానికులతో సమావేశం.
5.55 – తిమ్మారెడ్డివాగు వద్ద స్థానికులతో మాటామంతీ.
6.25 – వడ్డెకండ్రిగలో రైతులతో సమావేశం.
6.35 – జంగాలపల్లెలో స్థానికులతో మాటామంతీ.
6.55 – అద్దెపూడిలో స్థానికులతో మాటామంతీ.
7.35 – ఎల్లసిరి హిస్టాల్ జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ.
7.45 – ఎల్లసిరిలో స్థానికులతో సమావేశం.
7.55 – ఈశ్వరవాక మల్లెమాల జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ.
8.25 – పాదయాత్ర 1800 కి.మీ. మైలురాయి చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.
8.35 – భయ్యావారికండ్రిగలో స్థానికులతో సమావేశం.
9.55 – తాడిమేడు క్రాస్ వద్ద విడిది కేంద్రంలో బస.
******