రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కత్తితో గుండెను కోసినట్టనిపించింది: పవన్ కల్యాణ్

  • రాజోలు నియోజకవర్గం మలికిపురంలో బహిరంగ సభ
  • హాజరైన పవన్ కల్యాణ్
  • దెబ్బతిన్న పరిస్థితుల్లో రాజోలు ప్రజలు గొప్ప విజయం అందించారన్న పవన్
  • ఇక్కడి ప్రజలు ఒక ఆశ కల్పించారని వెల్లడి
జనసేనాని పవన్ కల్యాణ్ రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కత్తితో గుండెను కోసినట్టు అనిపించిందని తెలిపారు. ఒక ఆశయం కోసం పోరాటం చేస్తున్నప్పుడు గెలుపోటములు ఉంటాయని తెలుసని, అలాంటి సమయంలో రాజోలులో ప్రజలు ఇచ్చిన గెలుపుతో సేదదీరినట్టు అనిపించిందని అన్నారు. 

రాజోలు ప్రజలు అందించిన విజయం ఎడారిలో ఒయాసిస్ లాంటిది... దెబ్బతిన్న పరిస్థితుల్లో ఇక్కడి ప్రజలు ఒక ఆశ కల్పించారని  పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 150 మందితో ప్రారంభమైన జనసేన ఒక్క రాజోలులోనే 10,274 మంది క్రియాశీలక సభ్యుల స్థాయికి ఎదిగిందని వివరించారు. 

"ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఒక పార్టీ గుర్తుపై గెలుస్తాడు. ఆ తర్వాత పార్టీ మారతాడు. ఆ వ్యక్తి ప్రజల ఓటు అనే బోటుపై గెలిచాడు.... కానీ అందరి ఓట్లతో గెలిచిన ఆ వ్యక్తి తన వ్యక్తిగత నిర్ణయాలతో పార్టీ మారడం తప్పు... అది ఏ ఎమ్మెల్యే అయినా సరే!" అని వివరించారు.


More Telugu News