ప్రాజెక్ట్-కె ప్రపంచమంతా మార్మోగడం ఖాయం: కమల్ హాసన్
- ప్రభాస్, దీపిక పదుకొనే జంటగా ప్రాజెక్ట్-కె
- నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ సైంటిఫిక్ మూవీ
- తాజాగా కమల్ హాసన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్టు ప్రకటన
- ప్రాజెక్ట్-కె చిత్రంలో నటిస్తుండడంపై సంతోషం వ్యక్తం చేసిన కమల్
ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్-కె చిత్రంలో విఖ్యాత నటుడు కమల్ హాసన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్-కె లో కమల్ హాసన్ కూడా నటిస్తున్నారని చిత్రబృందం ఇవాళే ప్రకటించడంతో, ఈ సినిమాపై మరింత భారీ హైప్ ఏర్పడింది.
ప్రాజెక్ట్-కె లో తాను నటిస్తుండడంపై కమల్ కూడా స్పందించారు. "50 ఏళ్ల కిందట నేను డ్యాన్స్ అసిస్టెంట్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా చిత్ర రంగంలో ప్రస్థానం ప్రారంభించాను. ఆ సమయంలో నిర్మాతగా అశ్వినీదత్ పేరు బలంగా వినిపించేది. ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత ఇద్దరం కలిశాం.
నాగ్ అశ్విన్ రూపంలో ఓ మేధావి అయిన యువ దర్శకుడు తదుపరి తరం నుంచి తెరపైకి వచ్చాడు. ప్రాజెక్ట్-కె చిత్రంలో నా సహనటులు ప్రభాస్, దీపికా పదుకొనే కూడా ఈ ఆధునిక తరానికి చెందినవారే. ఇక, అమితాబ్ బచ్చన్ తో నేను గతంలో పనిచేశాను. కానీ ఆయనతో ఎప్పుడు పనిచేసినా ఇదే మొదటిసారి అన్నట్టుగా అనిపిస్తుంది. అమితాబ్ తనను తాను ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. నేను కూడా ఆయనలాగే సరికొత్తగా ఉండాలని ప్రయత్నిస్తుంటాను.
ప్రాజెక్ట్-కె చిత్రం కోసం నేనెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ప్రేక్షకులు తమ హృదయాల్లో నాకు ఎలాంటి స్థానం ఇచ్చినప్పటికీ, నాణ్యమైన నటన కనబర్చడమే నా తొలి ప్రాధాన్యత. చెప్పాలంటే నేను సినిమా పిచ్చోడ్ని. అందుకే సినిమా రంగంలో ఏ కొత్త ప్రయత్నం నా దృష్టికి వచ్చినా అభినందిస్తుంటాను. ఇప్పుడు ప్రాజెక్ట్-కె చిత్రాన్ని కూడా మొదటగా నేనే అభినందించాలనుకుంటున్నా.
నాగ్ అశ్విన్ తనదైన ఆలోచన విధానంతో ప్రాజెక్ట్-కె చిత్రాన్ని తెరకెక్కిస్తున్న తీరు దేశవ్యాప్తంగానూ, ప్రపంచ సినిమా రంగంలోనూ మార్మోగుతుందని కచ్చితంగా చెప్పగలను" అని కమల్ హాసన్ వివరించారు.