ప్రధాని మోదీ ఈజిప్టు పర్యటన సాగిందిలా...!
- అమెరికాలో నాలుగు రోజుల పాటు పర్యటించిన ప్రధాని మోదీ
- శనివారం సాయంత్రం ఈజిప్టు రాజధాని కైరో చేరిక
- మోదీకి స్వయంగా స్వాగతం పలికిన ఈజిప్టు ప్రధాని
- నేడు పలు కార్యక్రమాలతో బిజీగా గడిపిన మోదీ
అమెరికా పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ రెండ్రోజుల ఈజిప్టు పర్యటన కోసం నిన్న కైరో చేరుకున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఈజిప్టులో పలు కార్యక్రమాలతో మోదీ బిజీగా గడిపారు. శనివారం సాయంత్రం కైరో ఎయిర్ పోర్టులో మోదీకి ఈజిప్టు ప్రధాని ముస్తఫా మద్బౌలీ స్వయంగా స్వాగతం పలకడం విశేషం.
తన పర్యటనలో భాగంగా మోదీ... 1000 ఏళ్ల చరిత్ర ఉన్న అల్ హకీం మసీదును సందర్శించారు. ఇస్లామిక్ వర్గాల్లో ఈ మసీదుకు ఎంతో విశిష్టత ఉంది. భారత్ కు చెందిన దావూదీ బోహ్రా అనే వర్గానికి చెందిన ముస్లింలు అల్ హకీం మసీదును పరమ పవిత్ర సాంస్కృతిక ప్రదేశంగా పరిగణిస్తారు.
ఇక, మొదటి ప్రపంచయుద్ధంలో ఈజిప్టు-పాలస్తీనా తరఫున పోరాడి అమరులైన 4 వేల మంది భారతీయ సైనికులకు ప్రధాని మోదీ కైరో లోని హీలియోపొలిస్ కామన్వెల్త్ శ్మశానవాటికలో ఘన నివాళులు అర్పించారు.
అనంతరం, ఈజిప్టు దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫతే ఎల్ సిసీతో మోదీ సమావేశమయ్యారు. ఇరువురి మధ్య భారత్-ఈజిప్టు దేశాల దౌత్య సంబంధాలు చర్చకు వచ్చాయి. ఈ పర్యటన సందర్భంగా భారత్, ఈజిప్టు మధ్య టెక్నాలజీ, వాణిజ్యం, సంస్కృతి, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగాల్లో పలు ఒప్పందాలు కుదిరాయి.