కాబోయే డాక్టర్ ఇంట్లో గంజాయి హైటెక్ సాగు
- కర్ణాటకలోని శివమొగ్గలో వైద్య విద్యార్థి నిర్వాకం
- మరో ఇద్దరితో కలిసి దందా.. ముగ్గురినీ అరెస్టు చేసిన పోలీసులు
- వంద గ్రాముల చరస్, గంజాయి విత్తనాలు స్వాధీనం
కర్ణాటకలో కాబోయే డాక్టర్ ఒకతను తప్పుదోవ పట్టాడు. తన తెలివితేటలను ఉపయోగించి ఇంట్లోనే గంజాయి సాగు మొదలుపెట్టాడు. హైటెక్ పద్ధతులను పాటిస్తూ పక్కింటి వాళ్లకు కూడా అనుమానం రాకుండా మొక్కలు పెంచుతున్నాడు. మరో ఇద్దరిని కలుపుకుని కాలేజీ విద్యార్థులకు గంజాయి అమ్మడం మొదలుపెట్టాడు. డాక్టర్ గా రోగులకు సేవ చేయాల్సిన వాడు కాస్తా పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన విఘ్నరాజ్.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వైద్య శాస్త్రం చదువుతున్నాడు. డబ్బు సంపాదించాలనే కోరికతో తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. అధునాతన పద్ధతులలో ఇంట్లోనే గంజాయి సాగుకు పూనుకున్నాడు. దీనికోసం ఇంట్లో ప్రత్యేకంగా ఓ సెటప్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా పెంచిన గంజాయిని పండిదొరై, వినోద్ కుమార్ ల సాయంతో కాలేజీ విద్యార్థులకు అమ్మడం మొదలుపెట్టాడు.
ఇటీవల విశ్వసనీయ సమాచారం అందడంతో పక్కా ప్లాన్ తో పోలీసులు విఘ్నరాజ్ ఇంట్లో సోదాలు జరిపారు. లోపల సెటప్ చూసి పోలీసులే అవాక్కయ్యారట. చుట్టూ పరద చుట్టి, లోపల వేడి కోసం లైట్లు, గాలి కోసం ఫ్యాన్ ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు. విఘ్నరాజ్ ఇంట్లో జరిపిన సోదాల్లో 227 గ్రాముల గంజాయి, 1.53 గ్రాముల పచ్చి గంజాయి, 10 గ్రాముల చరస్‌లు, గంజాయి విత్తనాలతో కూడిన చిన్న సీసాలతో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.