ఆరేళ్లుగా నిరంతరాయంగా పాలధార కురిపిస్తున్న గోవు.. కారణం చెప్పిన పశు వైద్యులు!
- కర్నూలు జిల్లా దేవనబండలో ఘటన
- చివరిసారి ఆరేళ్ల క్రితం ఈనిన జెర్సీ ఆవు
- అప్పటి నుంచి నిరంతరాయంగా రోజుకు నాలుగు లీటర్ల పాలు
- ఏ సమయంలో పితికినా పాలిస్తున్న గోవు
ఓ ఆవు ఆరేళ్లుగా నిరంతరాయంగా పాలు ఇస్తూనే ఉంది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం దేవనబండకు చెందిన నాగప్ప పుష్కరకాలం క్రితం ఓ జెర్సీ ఆవును కొనుగోలు చేశాడు. ఈ కాలంలో అది నాలుగు దూడలకు జన్మనిచ్చింది. చివరిసారి ఆరేళ్ల క్రితం ఈనింది. అప్పటి నుంచి రోజుకు నాలుగు లీటర్ల పాలు ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
సాధారణంగా ఆవు ఈనిన తర్వాత కొన్ని నెలలు మాత్రమే పాలిస్తుంది. అయితే, ఈ జెర్సీ ఆవు మాత్రం సంవత్సరాల తరబడి పాలధార కురిపిస్తూనే ఉండడంతో చూసేందుకు జనం ఎగబడుతున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఎప్పుడు పితికినా పాలు వస్తుండడడం. కొన్ని రకాల జెర్సీ ఆవులు ఈత లేకున్నా పాలిచ్చే సహజ లక్షణాలు ఉంటాయని పశువైద్యులు చెబుతున్నారు.