వివేకా హత్య కేసులో ఉన్న అనుమానాలపై ఎంపీ అవినాశ్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ!

  • వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డి
  • నేడు మరోసారి సీబీఐ కార్యాలయానికి వచ్చిన కడప ఎంపీ
  • ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉన్న అవినాశ్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి మరోసారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఆయన నేడు హైదరాబాదులోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. వివేకా హత్య కేసులో ఉన్న అనుమానాలపై సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డిని ప్రశ్నించారు. అవినాశ్ రెడ్డి ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ కార్యాలయంలోనే ఉన్నారు. అనంతరం సీబీఐ కార్యాలయం నుంచి తన నివాసానికి వెళ్లిపోయారు. 

వివేకా హత్య కేసులో అవినాశ్ ఇప్పటికే అనేక పర్యాయాలు సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఓ దశలో అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయబోతోందని ప్రచారం జరిగింది. అయితే, అనేక నాటకీయ పరిణామాల మధ్య అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.


More Telugu News