'నాకు హద్దుల్లేవ్ .. సరిహద్దుల్లేవ్': 'భోళాశంకర్' టీజర్ డైలాగ్!
- 'భోళా శంకర్'గా చిరంజీవి
- కొంతసేపటి క్రితం వదిలిన టీజర్
- మాస్ హీరోగా విశ్వరూపం చూపించిన చిరూ
- ఆగస్టు 11వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్
చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళాశంకర్' సినిమా రూపొందుతోంది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించాడు. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాలో, హీరోకి చెల్లెలిగా కీర్తి సురేశ్ కనిపించనుంది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు.
'ఒక్కడు 33 మందిని చంపేశాడు .. ఎలా?' అనే డైలాగ్ తో ఈ టీజర్ మొదలైంది. ఆ ప్రశ్నకి సమాధానంగా మెగాస్టార్ రౌడీల భరతం పట్టడం చూపించారు. ' షికారుకొచ్చిన షేర్ ను బే .. నాకు హద్దుల్లేవ్ .. సరిహద్దుల్లేవ్' అంటూ చిరూ చెప్పే మాస్ డైలాగ్స్ టీజర్ కి హైలైట్ గా చెప్పుకోవాలి.
యాక్షన్ సీన్స్ .. మాస్ డైలాగ్స్ పై కట్ చేసిన ఈ టీజర్ మెగా అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. 2015లో అజిత్ హీరోగా వచ్చిన 'వేదాళం' సినిమాకి ఇది రీమేక్. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మెగాస్టార్ బర్త్ డేకి దగ్గరలో వస్తున్న ఈ సినిమా, వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించవచ్చనేది ఫ్యాన్స్ మాట.