నాటి విజనరీ పాలనకు, నేటి విధ్వంసకుడి అరాచకానికి నిలువుటద్దం ఫ్యాక్స్ కాన్!: నారా లోకేశ్

  • సూళ్లూరుపేట నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • ఫాక్స్ కాన్ ఉద్యోగులను చూసి సంతోషం వ్యక్తం చేసిన లోకేశ్
  • ఓ సెల్ఫీ తీసుకున్న వైనం
  • నాడు మంత్రిగా ఉన్నప్పుడు ఫాక్స్ కాన్ ను శ్రీసిటీకి రప్పించానని వెల్లడి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సూళ్లూరుపేట నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేశ్ ఫాక్స్ కాన్ సంస్థ ఉద్యోగుల బస్సును చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఓ సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం తన స్పందన వెలిబుచ్చారు. 

"ఈ బస్సులో చిరునవ్వులు చిందిస్తున్నది ఫాక్స్ కాన్  కంపెనీలో పనిచేస్తున్న నా చెల్లెళ్లు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నేను ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా చొరవ తీసుకుని ఫాక్స్ కాన్  ను శ్రీసిటీకి రప్పించాను. ఆ సంస్థ రూ.12,700 కోట్ల పెట్టుబడితో తమ యూనిట్ ను ఏర్పాటుచేసి, 14 వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.

ట్విస్ట్ ఏమిటంటే ఇదే కంపెనీ జగన్ రెడ్డి గారి జె-ట్యాక్స్ బెడద తట్టుకోలేక లక్ష మందికి ఉద్యోగాలు కల్పించే మరో యూనిట్ కు ఇటీవల తెలంగాణాలో భూమి పూజ చేసింది. నీ ధన దాహానికి రాష్ట్ర ప్రజలు ఇంకా ఎంత మూల్యం చెల్లించుకోవాలి జగన్ రెడ్డీ?" అంటూ లోకేశ్ ఆవేశంతో ప్రశ్నించారు. 

నాటి విజనరీ పాలనకు, నేటి విధ్వంసకుడి అరాచకానికి నిలువుటద్దం ఫాక్స్ కాన్ అని అభివర్ణించారు.


More Telugu News