'రాజా రమ్యం' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!
- యూత్ ఫుల్ లవ్ స్టోరీగా 'రాజా రమ్యం'
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- హీరో .. హీరోయిన్లుగా విఘ్నేశ్ - ఆశ్రిత
- ఆకట్టుకుంటున్న చరణ్ అర్జున్ బాణీ
గ్రామీణ నేపథ్యంలో వచ్చిన చాలా ప్రేమకథా చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. పల్లెటూరు అనగానే సహజంగానే ఆ కథ కొంత కనెక్ట్ అవుతుంది. ఇక కథ .. పాటలు బాగుంటే దాదాపు హిట్ వచ్చి ఖాతాలో పడినట్టే. అలాంటి ఒక గ్రామీణ ప్రేమకథా చిత్రంగా రూపొందింది 'రాజా రమ్యం'.
ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే టీనేజ్ లవ్ స్టోరీ. స్కూల్ స్థాయిలోనే ఈ ప్రేమాయణం పల్లె అందాలను సాక్ష్యంగా చేసుకుని నడుస్తుంది. అలాంటి ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'పోరా పోరా పోరగాడా .. పెద్ద పోరాటమే గుండె కాడా' అంటూ ఈ పాట సాగుతోంది.
సంగీత సాహిత్యాలు చరణ్ అర్జున్ అందించిన ఈ పాటను దివ్య మాలిక ఆలపించారు. ఆమె స్వరం ఈ పాటకి జీవం పోసిందనే చెప్పాలి. విఘ్నేశ్ రెడ్డి - ఆశ్రిత జంటగా నటించిన ఈ సినిమాకి, ప్రణీల్ గౌరిపాగ దర్శకత్వం వహించాడు. యూత్ కి ఈ సినిమా ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందనేది చూడాలి.