తెలంగాణలో పోడు భూముల పట్టాల పంపిణీ ఈ నెల 30కి వాయిదా
- గిరిజనులకు పోడు భూముల పట్టాలు
- ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభోత్సవ కార్యక్రమం
- హాజరుకానున్న సీఎం కేసీఆర్
- వారి సొంత నియోజకవర్గాల్లో పట్టాల పంపిణీ చేయనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
గిరిజనులకు పోడు భూముల పట్టాలను ఈ నెల 30న పంపిణీ చేయనున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఓ కార్యక్రమంలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజున మంత్రులు, ఎమ్మెల్యేలు వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నారు.
వాస్తవానికి నేటి నుంచే పోడు భూముల పట్టాలను గిరిజనులకు అందించాలని భావించారు. అయితే, జాతీయ ఎన్నికల కమిటీ తెలంగాణలో పర్యటిస్తుండడం, దానికి సంబంధించి జిల్లాల కలెక్టర్లు నిన్న, ఇవాళ శిక్షణ తరగతులు నిర్వహిస్తుండడం, ఈ నెల 29న బక్రీద్ పండుగ ఉండడం వంటి కారణాలతో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జూన్ 30కి వాయిదా వేశారు.