స్టన్నింగ్ డిజైన్ తో వస్తున్న హ్యుందాయ్ చిన్ని ఎస్ యూవీ
- ఈ నెల 10న మార్కెట్లో విడుదల
- టాటా పంచ్ కు గట్టి పోటీ
- రూ.6-9.50 లక్షల మధ్య ధర
దక్షిణ కొరియా సంస్థ హ్యుందాయ్ మోటార్ చూడచక్కని డిజైన్ తో చిన్న ఎస్ యూవీ ఎక్స్ టర్ జులై 10న విడుదల చేయనుంది. దీనికి మంచి ఆదరణ వస్తుందని కంపెనీ భావిస్తోంది. ఫొటోలు చూస్తే చిన్న సైజుతో, ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఎస్ యూవీ మార్కెట్లో మరింత వాటాను గెలుచుకునే వ్యూహంతో దీన్ని తీసుకొస్తోంది. ఇది ప్రధానంగా టాటా మోటార్స్ పంచ్ మోడల్ కు పోటీ ఇవ్వనుంది. దీన్ని మైక్రో మోడల్ గా కంపెనీ చెబుతోంది.
హ్యుందాయ్ నుంచి ఇప్పటికే క్రెటా, ఆల్కజార్, టుస్కాన్, వెన్యూ ఎస్యూవీ మోడళ్లు ఉండగా, ఎక్స్ టర్ తో హ్యుందాయ్ స్థానం మరింత బలోపేతం కానుంది. దీని ధర రూ.6 లక్షల నుంచి రూ.9.50 లక్షల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. హ్యుందాయ్ నుంచి వస్తున్న చౌక ఎస్ యూవీ ఇదే కావడం గమనార్హం. తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ఉన్న ప్లాంట్ లో హ్యుందాయ్ మోటార్స్ ఎక్స్ టర్ ను తయారు చేయనుంది.
ఈ కారులో 8 అంగుళాల హెచ్ డీ టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే, 4.2 అంగుళాల డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సీటు బెల్ట్ రిమైండర్, డాష్ బోర్డ్ కెమెరా, ముందు వెనుక భాగంలో కెమెరాలు, కార్ కనెక్టర్ ఫీచర్లను అందించింది. ఈ వాహనానికి సీఎన్ జీ సదుపాయం కూడా ఉంటుంది.